ఈ మధ్య మా అయన గారికి నాకు చిన్న గొడవ జరిగింది. అదేలెండి పీనాసి మొగుడు అని ఒక టపా రాసాను కదా! నేను అలా ఎప్పుడు చేసాను అని అడిగారు. నేను సరదాగా మొన్న చేసారు కదా అన్నాను. అంతే మొదలు.
సరే పుట్టినరోజు వస్తుంది కదా కొంచెం బంగారం కొనుక్కోనా అని అడిగాను. కోపంలో ఉన్నారేమో ఇప్పుడు కాదు అనేసారు. నేను వదులుతానా? ఏదో మాయ చేసి ఒప్పించాను. అసలే బంగారం రేటు కొంచెం తగ్గింది కదా!
అంతా అయ్యాక ఇప్పుడు నాకు ధర్మ సందేహం వచ్చింది. బంగారం ఐతే కొనాలి, కానీ ఏమి కొనాలి. మెదలోకి చైన్ కొంటే చైన్ కోసం గొంతులు తెగిపోతున్నాయి. బాబోయ్ వద్దు.
మరి ఉంగరం, చెవులకు దిద్దులు అంటే అబ్బే మరీ ఇంట చిన్నవా అని పించింది. అందుకే బాగా అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అది మా వారికి చెప్పగానే ఇంకేముంది మొన్న ముగిసిన యుద్ధం మల్లి మొదలు.
న్యాయం మీరే చెప్పండి. బంగారం కొనుక్కో మన్నారు కదా మళ్లీ ఇలా మాట మార్చవచ్చా? ఎంత భార్య ఐతే మాత్రం మరీ ఇంట చులకనటండి. మాట ఇచ్చి తప్పటానికి? అందుకే యానకు తెలియకుండా బజారుకి వెళుతున్నాను. ష్... ! మీరు కూడా ఆయనకు చెప్పకండి.
ఆ... పిలిచారా! ఓహ్ , ఏమి కొనటానికి వెళుతున్నాను అని అడుగుతున్నారా! అదేనండి "వడ్డాణం" ఒక సారి ఆర్డర్ ఇస్తే ఆయనే డబ్బులు కడతారు కదా!
అన్నట్లు చెప్పటం మరచి పోయాను, దొంగలు ఎవరైనా ఉన్నారో ఏంటో, మీరు కూడా ఎవరికీ చెప్పకండే. అసలే మంచి రోజులు కావు కదా!

No comments:
Post a Comment