ఏవండీ! మన పాప
పుట్టిన రోజు వచ్చే నెలలో వస్తుంది కదా, దానికి ఒక సైకిల్ కొందామండి.
వచ్చే నెలలో
కదా! అప్పుడు చుద్దాం!
* * * *
ఏవండీ! పాప పుట్టిన
రోజు వస్తుంది కదా! సైకిల్…
చూద్దాం!
* * * *
ఏవండీ! దాని
పుట్టిన రోజుకు కొందామనుకున్న సైకిల్ ఇప్పుడయినా తీసుకుందాం!
ఇప్పుడా! వచ్చే
నెల జీతం రాగానే చుద్దాం!
* * * *
ఏవండీ! ఫలానా
షాప్ లో సైకిళ్ళు 50% ఆఫర్ నడుస్తుందట, వెళ్దామండి.
అబ్బా వాడు అలాగే
చెప్తాడు. పాత ష్టాకు ఉంటుంది. మనం చక్కగా కొత్తది కొనుక్కుందాం!
* * * *
ఏవండీ! ఆ షాప్
లో ఆఫర్ అయిపొయిందట. ఇప్పుడు వెళదామా!
మొన్ననేకదా ఆఫర్
ఐపోయింది, పాత ష్టాకు అయిందో లేదో? వచ్చే నెల చుద్దాంలే!
* * * *
ఏవండీ! ఈ నెలలో
అయినా దాని సైకిల్…
అదికాదోయ్! మా
నాన్నకు చెప్పాను సైకిల్ తీసుకొవాలని. మన వూరిలో ఫలానా షాప్ మనకు బాగా తెలిసిన వాళ్ళది,
అక్కడ తీసుకుందాం అన్నరు మా నాన్న. ఈ సారి
మనం వూరికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం!
* * * *
హలో, ఏవండీ!
వినిపిస్తుందా! ఆ .. వచ్చేటప్పుడు దాని సైకిల్….. అదే తెలిసిన షాపు ఉంది అని … ఆ ఒకసారి
..
మానాన్నకు ఉన్న
సైకిల్ నచ్చలేదంట, మళ్ళీ ష్టాకు వచ్చినప్పుడు మంచిది తెమ్మని చెప్పారంట.
ఏవండీ! వచ్చే
నెలలో పాప పుట్టిన రోజు వస్తుంది. కనీసం ఈ సారయినా దాని సైకిల్…
నాన్న చెప్పరు
కదా షాప్ వాళ్ళకి, వాళ్ళు ఇంకో రెండు నెలలలో కొత్త ష్టాకు తెస్తారట. అప్పుడు చుద్దాం.
No comments:
Post a Comment